Saturday, March 21, 2020

ఆశా పాశం పాట c/o కంచరపాలెం

ఆశా పాశం బంది చేసేలే

సాగే కాలం ఆడే ఆటేలే

తీర తీరం చేరే లోగానే ఎతీరవునో..



చేరువైన సేదు దూరాలే

తోడవ్తూనే వీడే వైనాలే

నీదో కాదో తెలే లోగానే ఎదేటవ్నో..

ఆటు పోటు గుండె మాటుల్లోన..

సాగేనా…



ఏ లే లే లేలో..

కల్లోలం ఈ లోకంలో

లో లో లోలోతుల్లో

ఏ లేలో ఎద కొలనులో..



నిండు పున్నమేల మబ్బు కమ్ముకొచ్చి

సిమ్మ సీకటై పోతుంటే

నీ గమ్యం గంధరగోళం..

దిక్కు తోచకుండ తల్లడిల్లిపోతు

పల్లటిల్లిపోయి నీవుంటే..

తీరేనా నీ ఆరాటం..



ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో

నిశితంగా తెలిసేదెల

రేపేటవునో తేలాలంటే

నీ ఉనికి ఉండాలిగా



ఓ..ఓ.. ఆటు పోటు

గుండె మాటుల్లోన

సాగేనా…..



ఆశా పాశం బంది చేసేలే

సాగే కాలం ఆడే ఆటేలే

తీర తీరం చేరే లోగానే ఎతీరవునో



ఏ జాడలో ఏమున్నదో

క్రీనీడల విధి వేచున్నదో..

ఏ మలుపులో ఎం దాగున్నదో

నీవు గ తేల్చుకో..నీ శైలిలో..



చిక్కు ముళ్ళు గప్పి

రంగు లీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే

తెలియకనే సాగే కథనం..

నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్క దారి పట్టి పోతుంటే

కంచికి నీ కథలే దూరం…



నీ చేతుల్లో ఉంది సీతల్లో సూపించి ఎదురేగి సాగాలిగా

రేపేటవునో తేలాలంటే

నువ్వెదురు సూడాలిగా…



ఓ.ఓ.. ఆటు పోటు

గుండె మాటుల్లోన…ఉంటున్న….

ప్రియురాలి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా పాట సాహిత్యం

ప్రియురాలి అడ్రస్ ఏమిటో
చెప్పమ్మా కాస్త చెప్పమ్మా
జవరాలీ చిరునామేమిటో
చెప్పమ్మా కాస్త చెప్పమ్మా
ఆమె సిగను విరిసె మల్లీ
ఆమె నుంచి వీచె గాలీ
ఆమె నిదుర పొయే వేలా 
జోల పాడు ఓ జాబిల్లి
ఆమె సిగను విరిసె మల్లీ
ఆమె నుంచి వీచె గాలీ
ఆమె నిదుర పొయే వేలా 
జోల పాడు ఓ జాబిల్లి
చెప్పమ్మా కాస్త చెప్పమ్మా
చెప్పమ్మా కాస్త చెప్పమ్మా

ప్రియురాలి అడ్రస్ ఏమిటో
చెప్పమ్మాకా చెప్పమ్మా
జవరాలీ చిరునామేమిటో
చెప్పమ్మా కాస్త చెప్పమ్మా

నిదుర నదిలొ.. ఆమెకొసం..
నడిరేయి చాటునా.. మాటు వేసా
కలల వలలో.. ఆమె రూపం..
పడగానె వెంటనె.. లేచి చూసా
ఎరను కొరికె.. చిలిపి చేపా
కులుకు వెనకె.. కరిగిపొకా
తేల్లారిందె ఇట్టే.. నెనేమొ తెలబొతూ వుంటే
మల్లీ మల్లీ ఇంతె.. ప్రతి రాత్రి జరిగె తంతె
మసక తెరలు తెరిచెదెవరమ్మా

ప్రియురాలి అడ్రస్ ఎమిటో
చెప్పమ్మా కాస్త చెప్పమ్మా

కనులు వెతికె.. కన్నె ఎవరొ
వివరాలు తేలనీ.. మనసు నాదీ
తనను ఎవరొ.. పలకరిస్తె
నువ్వు కాదు పొమ్మనీ.. అంటున్నదీ
జంటలెన్నొ.. కంటబడితె
వయసు నన్నూ.. కసురుతొందె
భూమ్మీదింకా తానూ.. పుట్టిందో లెదొ భామా
ఏమొ తెలియదు గానీ..
మది ప్రెమించెసిందమ్మా
దీని గొదవ ఆపెదెవరమ్మా

ప్రియురాలి అడ్రస్ ఎమిటో
చెప్పమ్మా కాస్త చెప్పమ్మా
జవరాలీ చిరునామెమిటో
ఛెప్పమ్మా కాస్త చెప్పమ్మా
ఆమె సిగను విరిసె మల్లీ
ఆమె నుంచి వీచె గాలీ
ఆమె నిదుర పొయె వెలా
జోల పాడు ఓ జాబిల్లి
ఆమె సిగను విరిసె మల్లీ
ఆమె నుంచి వీచె గాలీ
ఆమె నిదుర పొయె వెలా
జోల పాడు ఓ జాబిల్లి
ఛెప్పమ్మా కాస్త చెప్పమ్మా
ఛెప్పమ్మా కాస్త చెప్పమ్మా

చిత్రం    : ఆహా...!
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
గానం    : వందేమాతరం శ్రీనివాస్

రంగు రెక్కల సీతాకోక చిలుకా పాట సాహిత్యం.....

పొద్దునే యెలిపోతే గోధూళి దాకా
పొద్దెట్టా గడిపేది బంగారి మావా....
ముప్పొద్దులా నీతోటి ముచ్చట్లే అయితే...
బువ్వెట్టాగొస్తాదే సింగారి బామా....

రంగు రంగూ రెక్కల సీతాకోక చిలుకా
సీతాకోక చిలుకా.....అఅఅ
తోటంతా తిరుగుతావమ్మా..నువు.తీరికేలేక
ఈ కన్నె విరిదాకా.. ఏ గుండే మూగ కేక
చేరుస్తున్నావో..
అది నీకైనా యెరికా...

రంగు రంగూ రెక్కల సీతాకోక చిలుకా
సీతాకోక చిలుకా.....అఅఅ
తోటంతా తిరుగుతావమ్మా..నువు.తీరికేలేక

1::::చరణం::::

ఉరికి ఉరికి ఊహలూరేగీ...పిల్ల గాలి ఊయలూగీ
ఉండి ఉండి గుండెలుప్పొంగి
..కొండవాగులాగ పొంగీ..
సరసాని కనువైనా..వరసేదో దొరికి...
ఎవరి దరికి చేరాలని ..ఎవరురాసినారో..
నీ రెక్కలపై... ఆ..రెక్కలపై..
నీ రెక్కలపై ...ఆ చుక్కల ప్రేమాలేఖా...

రంగు రంగూ రెక్కల సీతాకోక చిలుకా
సీతాకోక చిలుకా.....అఅఅ
తోటంతా తిరుగుతావమ్మా..నువు.తీరికేలేక

2::::చరణం::::

మూసుకున్న మనసు ముంగిలిలో
రంగవల్లులెన్నో వేసీ
వెలుగు రాని వయసు వాకిలిలో
ఎండిపూల మొక్కలేసీ...
కనువిందు కలిగించు..కిరణాల లిపిలో..
జన్మ ముడులు చదవమన్నా
బ్రమ్మ రాతయేమో...నీ రెక్కలపై...

ఆ..రెక్కలపై..
నీ రెక్కలపై ...ఆ చుక్కల ప్రేమాలేఖా...

రంగు రంగూ రెక్కల సీతాకోక చిలుకా
సీతాకోక చిలుకా.....అఅఅ
తోటంతా తిరుగుతావమ్మా..నువు.తీరికేలేక

సంగీతం: యం.యం.కీరవాణి
గానం.   : కీరవాణి

స్వాతి లో ముత్యమంత పాట బంగారు బుల్లోడు



వానా వానా వచ్చేనంట వాగు వంకా మెచ్చేనంట
తీగా డొంకా కదిలేనంట తట్టాబుట్టా కలిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగా కొండా కోనా నీళ్ళాడంగా
కృష్ణా గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పరిగెత్తంగా
వానా వానా వచ్చేనంటా వాగు వంకా మెచ్చేనంటా...

ఓహో... ఓహో...

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా
అల్లో మల్లో - అందాలెన్నో యాలో యాల...

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా

చరణం: 1
తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ
మేనక మెరపులు ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా
కోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ
శ్రావణ సరిగమ యవ్వన ఘుమ ఘుమ లయనీదమ్మ
వానా వానా వల్లప్పా వాటేస్తేనే తప్పా
సిగ్గు యెగ్గూ చెల్లెప్పా కాదయ్యో నీ గొప్పా
నీలో మేఘం నాలో దాహం యాలో యాల

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా

చరణం: 2
వానా వానా వచ్చేనంట వాగు వంకా మెచ్చేనంట
తీగా డొంకా కదిలేనంట తట్టాబుట్టా కలిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగా కొండా కోనా నీళ్ళాడంగా
కృష్ణా గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పరిగెత్తంగా

తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వాన
తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వణికే వాన
జన్మకు దొరకని మన్మధ తలుపులు ముదిరే వాన
చాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వాన
వానల్లోన సంపెంగ ఒళ్ళంతా ఓ బెంగా
గాలి వాన గుళ్ళోనా ముద్దేలే జేగంట
నాలో రూపం నీలో తాపం యాలో యాల

స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన
సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోనా
అల్లో మల్లో - అందాలెన్నో - యాలో యాల...

వానా వానా వచ్చేనంట వాగు వంకా మెచ్చేనంట
తీగా డొంకా కదిలేనంట తట్టాబుట్టా కలిసేనంట
ఎండా వానా పెళ్ళాడంగా కొండా కోనా నీళ్ళాడంగా
కృష్ణా గోదారమ్మ కలిసి పరవళ్ళెత్తి పరిగెత్తంగా

చిత్రం: బంగారు బుల్లోడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు , చిత్ర

అర్ధశతాబ్దపు పాట సిందూరం చిత్రం...

పల్లవి:

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా!

ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా! దానికి సలాము చేద్దామా!

శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సిందూరం

నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా! ఓ! పవిత్ర భారతమా!

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా

నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్చను చూద్దామా! దాన్నేస్వరాజ్యమందామా!

చరణం 1:

కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ

ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే, జనాలు తలలర్పిస్తారే

సమూహక్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకు పోతూ

మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపి రారే

అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి? పోరి, ఏమిటి సాధించాలి?

ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సిందూరం

జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా! ఓ అనాథ భారతమా!

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా!

ఆత్మవినాశపు అరాజకాన్ని స్వరాజ్యమందామా! దానికి సలాము చేద్దామా!


చరణం 2:

అన్యాయాన్ని సహించని శౌర్యం, దౌర్జన్యాన్ని దహించే ధైర్యం

కారడవులలో క్రూర మృగంలా దాక్కుని ఉండాలా! వెలుగుని తప్పుకు తిరగాలా!

శత్రువుతో పోరాడే సైన్యం, శాంతిని కాపాడే కర్తవ్యం

స్వజాతి వీరులనణచే విధిలో సవాలు చెయ్యాలా! అన్నల చేతిలో చావాలా!

తనలో ధైర్యం అడవికి ఇచ్చి, తన ధర్మం చట్టానికి ఇచ్చి

ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే

నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం, ఈ సంధ్యా సిందూరం

వేకువ వైపా, చీకటి లోకా ఎటు నడిపేవమ్మా! గతి తోచని భారతమా!

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా!

యుద్ధ నినాదపు అరాజకాన్ని స్వరాజ్యమందామా! దాన్ని సవాలు చేద్దామా!

చరణం 3:

తన తలరాతను తనే రాయగల అవకాశాన్నే వదులుకొని

తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకుని

ప్రజాస్వామ్యమని తలిచే జాతిని ప్రశ్నించడమే మానుకొని

కళ్ళు వున్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం

ఆ హక్కేదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం

కృష్ణుడు లేని కురుక్షేత్రముగ సాగే ఈ ఘోరం చితి మంటల సిందూరం

చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా! ఓ విషాద భారతమా


అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా

ఆత్మవినాశపు అరాజకాన్ని స్వరాజ్యమందామా! దానికి సలాము చేద్దామా!

శాంతి కపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం ఈ రక్తపు సిందూరం

నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మా! ఓ! పవిత్ర భారతమా!

అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా

నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేచ్చను చూద్దామా! దాన్నేస్వరాజ్యమందామా!

సంగీతం: శ్రీ
గానం    : ఎస్.పి. బాలు
రచన.   : సిరివెన్నెల సీతారామశాస్త్రి

విన్నారా సిత్రాలు పాట ముద్దుల మొగుడు....



విన్నారా... సిత్రాలు...
గొప్పోల్ల గర్బగుడి గోత్రాలు...
అయ్యింది ఇల్లాలు మొగుడి చెయ్యి పడకుండా శూలాలూ.....
అందాల పాల పిట్టరో... అల్లింది ఎవరి బుట్టరో...అరెరెరే....2
ఊరంత కనరండి.. ఈ వింత వినరండి. ఈ బుట్ట బొమ్మ గుట్టు ఎందిరో..... అరే.    ||అందాల||.

గుణ గుణ గుమ్మ.
దాని గుట్టు దాచే అమ్మ
పొట్ట విప్పి చూస్తే అది మేడి పండు కోమ్మ...
భళా భళి ఇది ఓ కథాకళి తరిగిట తరిగిట తొం.
గడసరి గిత్త అది గంగడోలు మొత్త.
కోర్టు కెల్లే అత్త దాని చరిత తిరగ రాస్తా.
కిలో మరి పెరిగే నెలో సరి
అనార్కలి సలీముకే ఘోరీ కట్టిందా
మరో గులే బకావలి స్టోరీ పుట్టిందా
ఆలినే శూలిగా చేసినొడు సోమలింగమా.. ఆ ఆ....||అందాల||

నువ్వు మగాడివే కాదని మదట సానికి ఎక్కారు కదా నీ అత్త ఆలిని ఎందుకొచ్చిన అల్లరంట
అత్తో దుత్తో నా సత్తా సుపిత్త రండేహే.
సత్తే మీకే తెలుసుద్ది.


మగసిరి గుమ్మ ఏ మగడు నిన్ను తాకే
పురుషుడు లేని ఈ పురుడు వీదికెక్కే
ఓహో సఖి ఎవడా మహపతి హా...
ఏడుబొడు కాదా ఏనాడు రాసలీల
ఎవడని చేస్తావ్ నీ బిడ్డ బారసాల
హల్లో సఖి ఎవడా చెలోపతి
మొగుడు పెళ్ళాం లావాదేవీ తునా బొడ్డేనా పుట్టిన బిడ్డ తండ్రి ఎవరంటే X Y Z ఏనా
అమ్మడా నీ జిమ్మడా ఆగదు నీ గుండెలో దడ దడ....||అందాల||


అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట
 బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట ||2||
బుల్ పిట్ట బుల్ పిట్ట బుల్ పిట్ట పిట్ట పిట్ట బుల్ పిట్ట ||2||.

చిత్రం: .    ముద్దుల మొగుడు
సంగీతం:  కోటి
దర్శకత్వం: కోదండరామిరెడ్డి