Saturday, March 21, 2020

ఆశా పాశం పాట c/o కంచరపాలెం

ఆశా పాశం బంది చేసేలే

సాగే కాలం ఆడే ఆటేలే

తీర తీరం చేరే లోగానే ఎతీరవునో..



చేరువైన సేదు దూరాలే

తోడవ్తూనే వీడే వైనాలే

నీదో కాదో తెలే లోగానే ఎదేటవ్నో..

ఆటు పోటు గుండె మాటుల్లోన..

సాగేనా…



ఏ లే లే లేలో..

కల్లోలం ఈ లోకంలో

లో లో లోలోతుల్లో

ఏ లేలో ఎద కొలనులో..



నిండు పున్నమేల మబ్బు కమ్ముకొచ్చి

సిమ్మ సీకటై పోతుంటే

నీ గమ్యం గంధరగోళం..

దిక్కు తోచకుండ తల్లడిల్లిపోతు

పల్లటిల్లిపోయి నీవుంటే..

తీరేనా నీ ఆరాటం..



ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో

నిశితంగా తెలిసేదెల

రేపేటవునో తేలాలంటే

నీ ఉనికి ఉండాలిగా



ఓ..ఓ.. ఆటు పోటు

గుండె మాటుల్లోన

సాగేనా…..



ఆశా పాశం బంది చేసేలే

సాగే కాలం ఆడే ఆటేలే

తీర తీరం చేరే లోగానే ఎతీరవునో



ఏ జాడలో ఏమున్నదో

క్రీనీడల విధి వేచున్నదో..

ఏ మలుపులో ఎం దాగున్నదో

నీవు గ తేల్చుకో..నీ శైలిలో..



చిక్కు ముళ్ళు గప్పి

రంగు లీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే

తెలియకనే సాగే కథనం..

నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్క దారి పట్టి పోతుంటే

కంచికి నీ కథలే దూరం…



నీ చేతుల్లో ఉంది సీతల్లో సూపించి ఎదురేగి సాగాలిగా

రేపేటవునో తేలాలంటే

నువ్వెదురు సూడాలిగా…



ఓ.ఓ.. ఆటు పోటు

గుండె మాటుల్లోన…ఉంటున్న….

No comments:

Post a Comment