Saturday, March 21, 2020

రంగు రెక్కల సీతాకోక చిలుకా పాట సాహిత్యం.....

పొద్దునే యెలిపోతే గోధూళి దాకా
పొద్దెట్టా గడిపేది బంగారి మావా....
ముప్పొద్దులా నీతోటి ముచ్చట్లే అయితే...
బువ్వెట్టాగొస్తాదే సింగారి బామా....

రంగు రంగూ రెక్కల సీతాకోక చిలుకా
సీతాకోక చిలుకా.....అఅఅ
తోటంతా తిరుగుతావమ్మా..నువు.తీరికేలేక
ఈ కన్నె విరిదాకా.. ఏ గుండే మూగ కేక
చేరుస్తున్నావో..
అది నీకైనా యెరికా...

రంగు రంగూ రెక్కల సీతాకోక చిలుకా
సీతాకోక చిలుకా.....అఅఅ
తోటంతా తిరుగుతావమ్మా..నువు.తీరికేలేక

1::::చరణం::::

ఉరికి ఉరికి ఊహలూరేగీ...పిల్ల గాలి ఊయలూగీ
ఉండి ఉండి గుండెలుప్పొంగి
..కొండవాగులాగ పొంగీ..
సరసాని కనువైనా..వరసేదో దొరికి...
ఎవరి దరికి చేరాలని ..ఎవరురాసినారో..
నీ రెక్కలపై... ఆ..రెక్కలపై..
నీ రెక్కలపై ...ఆ చుక్కల ప్రేమాలేఖా...

రంగు రంగూ రెక్కల సీతాకోక చిలుకా
సీతాకోక చిలుకా.....అఅఅ
తోటంతా తిరుగుతావమ్మా..నువు.తీరికేలేక

2::::చరణం::::

మూసుకున్న మనసు ముంగిలిలో
రంగవల్లులెన్నో వేసీ
వెలుగు రాని వయసు వాకిలిలో
ఎండిపూల మొక్కలేసీ...
కనువిందు కలిగించు..కిరణాల లిపిలో..
జన్మ ముడులు చదవమన్నా
బ్రమ్మ రాతయేమో...నీ రెక్కలపై...

ఆ..రెక్కలపై..
నీ రెక్కలపై ...ఆ చుక్కల ప్రేమాలేఖా...

రంగు రంగూ రెక్కల సీతాకోక చిలుకా
సీతాకోక చిలుకా.....అఅఅ
తోటంతా తిరుగుతావమ్మా..నువు.తీరికేలేక

సంగీతం: యం.యం.కీరవాణి
గానం.   : కీరవాణి

No comments:

Post a Comment